You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

31 January 2009

రాష్ట్రానికి భారం అయిన బాబు: చంద్రబాబు

మనిషి అనేవాడికి పరివర్తన ఉంటుంది అని నమ్మేవాడిని నేను. కాని ఒక మనిషి పరివర్తన చెందాడో లేదో ఎలా తెలుస్తుంది. పశ్చాత్తాపం పొందిన వాడికి మంచి బుద్ధి వస్తుందా లేక మెల్లగా పాత పోకడలకు ఆకర్షితుడై మళ్ళీ అదే దారిలో వేదతాడ అనేది కూడా చెప్పలేము.

కాని పశ్చాత్తాపం పొందని వాడి గురించి అస్సలు ఆలోచించడం కూడా తప్పేమో ! చేసిన తప్పులకు, తీసుకున్న తప్పుడు నిర్ణయాలను తను ఏ నాడు ఒప్పుకోలేదు. జనాన్ని క్షమించమని కూడా అడగలేదు. 'ఇప్పుడు మారాను' అని మాత్రం సూచన ప్రాయంగా ఒక రోడ్ షోలో అప్పుడెపుడో కూసాడు. కనీ అది నమ్మాలా ? నమ్మినా ఎంత వరకు నమ్మాలి ?

నేను నమ్మలేకపోతున్నా. మనసు ఒప్పుకోవడం లేదు. వ్యవసాయం దండగ అని అన్న మాటలు ఇంకా మరిచిపోలేదు. తన మిత్ర పక్షానికి చెందినా కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి "జనం తిన్నది అరగక చచ్చిపోతున్నారు" అని అన్నప్పుడు కాస్తంత కూడా స్పందించని నాయకుడు.

కేంద్రంలోని భాజపా సర్కారుని మాటిమాటికి బెదిరించి తెచ్చిన పనికి ఆహారం బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో చవకగా అమ్ముకుంటున్న పార్టీ వర్గాలను, మంత్రులను నియంత్రించలేకపోయాడు (తానే అమ్మించాడో మరి, ఎవడికి తెలుసు). ఫలితంగా రేయింబవళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని కారుచవకగా కుప్ప నూర్చిన వెంటనే పొలంలోనే అమ్ముకోవలసి వచ్చిన రైతుల దుస్థితి చూశాను. వారు పడిన బాధ, అనుభవించిన కష్టమే కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు చప్పున, మరికొన్ని చోట్ల అస్సలు ఖాతా తెరువకుండానే పోయేలా వచ్చిన ఎన్నికల ఫలితాలలో నాకు కనపడుతుంది.

రాష్ట్రమంతటా రైతులు ప్రాణాలు కోల్పోతుంటే, చిన్న రైతులు తండోపతండాలుగా పొరుగు రాష్ట్రాలకు కూలి పని చేసుకోడానికి తరలిపోతుంటే మిన్నకుండిన ఘనుడు. అభివృద్ది అమోఘం అని, తనకి సాటిలేరని, తన పాలన బ్రహ్మాండం అని డప్పుకొట్టుకు తిరిగిన కలి కాలపు తిమ్మరసు.

అటువంటి వ్యక్తి ఇవ్వాళ రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతూ రైతులకి ఆ వరాలు ఈ వారాలు ఇస్తామని చెప్పడం, రైతులకి నేటి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని (చేసారా లేదా అనేది మరొక చర్చాంసం) చెప్పడం ఒకింత కూడా నమ్మ శక్యంగా లేదు.

ఇతనిని నేను నమ్మను. ఇతనికైతే నేను వోటు వేయలేను. ఎన్టీఆర్ వారసులను కాదు కదా, స్వయాన నేను అభిమానించే ఎన్టీఆర్ దిగి వచ్చినా వినలేను. ఈ రైతు ద్రోహికి రైతుల పక్షాన నిలుచోదానికే కాదు, వారి పక్షాన మాట్లాడడానికి అర్హత కూడా లేదు.

6 comments:

ఏకాంతపు దిలీప్ said...

@ అంజి బాబు
చంద్రబాబు వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధార పడుతున్నారు, అంత మంది ఆధార పడవలసిన అవసరం లేదు, ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసిన సమయం వచ్చింది అనే స్పూర్తితో వ్యవహరించాడు కానీ, వ్యవసాయం దండగ అనే స్పూర్తితో కాదు. రాజకీయులు లాగానే మీరు విమర్శలు చెయ్యాలి అనుకుంటే చెయ్యండి.

పనికి ఆహారం కింద ఎన్ని టన్నుల బియ్యం వచ్చింది? ఎంత పక్క దారి పట్టింది? ఆ పక్క దారి పట్టింది మన రాష్ట్ర మొత్తం ఉత్పత్తితో పోల్చుకుంటే ఎంత? ఒకవేళ బియ్యం చౌక ధరకి అమ్మేసుకుంటే, అన్ని జిల్లాలలోనూ, అన్ని మండలాల్లోనూ రైతులు కేవలం ఆ పక్క దారి పట్టిన బియ్యం వల్ల చౌక ధరకు అమ్మేసుకున్నారా?

ఒక్కసారి ఆలోచించి చెప్పండి... రైతుల దుస్థితికి పూర్తిగా అతనే భాధ్యుడుని చెయ్యడం ఎంత వరకూ సబబో మీరు వివరించాలి....

ఇకపోతే గ్రామాల్లో ఉపాధి కల్పన కింద కేంద్ర గణాంకాల సంస్థ నిర్వహించిన సర్వే లో 1998 నుండి 2004 వరకూ ఆంధ్ర ప్రదేష్ మొదటి స్థానంలో ఉంది...

మీరింతలా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయకత్వం వహించిన పర్టీ ప్రతి పక్షాలు అంతా ఏకమయినా కూడా కేవలం .9% వోట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది అని గమనించగలరు... ఉచిత విద్యుత్తు, ౠణాల మాఫీ వంటి రైతు ఆకర్షక పథకాలు కూడా గెలుపు ఓటముల మధ్య తేడాని భారీగా పెంచలేదు అని గమనించగలరు...అంటే అది 9 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒక పార్టీకి సహజంగా ఉండే వ్యతిరేకత ( రాజకీయాల్లో అధికారం ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి, ఒక వర్గం నుండి ఇంకో వర్గానికి బదిలీ అవుతుంది... ఆ కాలం పెరిగే కొద్దీ అధికారం ఆశించే వర్గాలు వ్యతిరేక శక్తిని మరింత పొందుతాయి..) అన్ని వర్గాలు కలిసేలా పనిచేసాయి అని చెప్తుందే కానీ, చంద్రబాబుని ప్రజలు, రైతులు పూర్తిగా వ్యతిరేకించారు అని చెప్పడం లేదు...

గడిచిన నాలుగేళ్ళగా జరుగుతున్న పరిణామాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కష్టకాలంలో చంద్రబాబు పాలన బాగుందో, ప్రకృతి కరుణిస్తున్నప్పుడు ఇప్పటి పాలన బాగుందో! అప్పుడు తెలుగు వారంతా ఎంత సమిష్టి భావంతో ఉన్నారో, ఇప్పుడు ఎంత గందరగోళంలో ఉన్నారో! ఏ జనం అయితే చంద్రబాబుని పశ్చాత్తాప పడేట్టు చేసారో ఆ జనం కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినందుకు పశ్చాత్తాప పడుతున్నారు అన్న విషయాన్ని మీరు గ్రహించగలరనుకుంట! కాకపోతే ఇప్పుడు ఇంకొక పార్టీ, ఇంకొక వర్గం వచ్చింది... అది లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పశ్చాత్తాప్పడుతున్న జనం అంతా తెలుగుదేశానికే వేసేవారు...

Anonymous said...

@ ఏకాంతపు దిలీప్

మీ స్పందనని నేను స్వాగతిస్తున్నాను. చంద్రబాబు పాలన గురించి మీ అభిప్రాయాలను మీరు చాల విపులంగా తెలియజేశారు. ఇది ఒక మంచి చర్చ అవ్వాలని నేను ఆసిస్తూ, ఇంతే విపులంగా నేను ప్రతిస్పందించడానికి కొంత సమయం కావాలి. ఇప్పుడు కొన్ని పనుల వలన నాకు తగినంత సమయం లేదు. అప్పటివరకు సెలవు.

అంజి బాబు

Anil Dasari said...

దిలీప్ అభిప్రాయమే నాదీను.

Alapati Ramesh Babu said...

chandrababu pacca selfish.donot vote to babu.

pseudosecular said...

@అంజి బాబు:

Most of your posts are against Babu and TDP. Any reason for that?

Why you hate him?

Anonymous said...

I dislike him because I think he is the most dishonest person to have ruled the state for such a long time.

I dont like him because of
- his incompetence,
- his indifference to the poor when in power,
-his lack of insight about the farm sector,
- his 'hunger' for power and publicity,
- his lies (particularly when he says he developed andhra during his tenure)

and the list goes on. Add to this the latest manifesto which shows his desperation to get back to power.

The incumbent govt is certainly no the cleanest of all but i can tell you they are the better lot among the jokers.

And going by our previous interactions and your comments I am for sure not going to ask you about your liking for Babu/TDP.

Jai janmabhumi

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge